అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) హైదరాబాద్ (Hyderabad) నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraju) సమీక్ష నిర్వహించగా.. సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్లో సూచనలు చేశారు.
పట్టణ కేంద్రంలో మొదటి విడతగా 260 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వార్డు ఇన్ఛార్జి సభ్యులు ప్రతిఒక్కరూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. నియోజవర్గంలోని బీర్కూర్(Birkoor), కిష్టాపూర్ (Kistapur), చించోలి, దామరంచ ఇసుక క్వారీల నుంచి ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయితే రూ. 4 లక్షలు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతుందని ఇంటి నిర్మాణం పూర్తయితే మిగతా రూ. లక్ష చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.