Homeజిల్లాలుకామారెడ్డిPocharam project | పోచారం ప్రాజెక్టు వద్ద గుంత పూడ్చివేత.. శాశ్వత నిర్మాణం కోసం ప్రతిపాదనలు

Pocharam project | పోచారం ప్రాజెక్టు వద్ద గుంత పూడ్చివేత.. శాశ్వత నిర్మాణం కోసం ప్రతిపాదనలు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు కనీవిని ఎరుగని రీతిలో వరద ప్రభావానికి లోనైంది. సాధారణ ఇన్​ఫ్లో inflow కు మూడింతల వరదను ఎదుర్కొంది. ఫలితంగా జలాశయం ఓవర్ హెడ్ overhead వద్ద మట్టి కట్ట కోతకు గురైంది.

Pocharam project : తాత్కాలిక పనులు..

ఈ విషయమై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు Yellareddy MLA Madanmohan Rao సూచన మేరకు రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ Irrigation Department అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గుంతను ఇసుక బస్తాలు, మొరం వేసి భర్తీ చేసినట్లు ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత శాశ్వత మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ శాశ్వత పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

కాగా, అంత పెద్ద వరద flood ఉద్ధృతిని తట్టుకొని నిలిచిన ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి సర్వత్ర ప్రశంసలు రావడంపై జిల్లా అధికారులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News