అక్షరటుడే, బాన్సువాడ: అన్ని మతాల వారు సమానత్వంతో జీవించే గొప్ప సంప్రదాయం గల దేశం మనదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ పట్టణంలోని (Banswada town) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ఆగ్రో ఇండ్రస్టీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Agro Industries Chairman Kasula Balaraju) కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చర్చి ఫాదర్, కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. కమిటీ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభువు జీవితం ప్రపంచ దేశాలకే ఆదర్శమని అన్నారు. ప్రేమ, క్షమ, త్యాగాలే ఆయన బోధల సారమని వివరించారు. క్రిస్మస్ పండుగను అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.