అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas | మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ డిపోలో శనివారం రెండు కొత్త సర్వీసు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
డిపోనకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు నిజామాబాద్ నుంచి జహీరాబాద్ (Nizamabad to Zaheerabad) వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్, బాన్సువాడ నుంచి నారాయణఖేడ్ వయా పిట్లం, నిజాంపేట్ మీదుగా నడుస్తాయన్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి తదితరులు పాల్గొన్నారు.