Siddapur Reservoir | సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిపై పోచారం పరిశీలన

అక్షరటుడే, బాన్సువాడ: Siddapur Reservoir | వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులను నిర్ణీత గడువులో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. Siddapur Reservoir | నాణ్యతలో రాజీ పడొద్దు.. నాణ్యతలో రాజీ పడొద్దని.. ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే […]

అక్షరటుడే, బాన్సువాడ: Siddapur Reservoir | వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులను నిర్ణీత గడువులో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

Siddapur Reservoir | నాణ్యతలో రాజీ పడొద్దు..

నాణ్యతలో రాజీ పడొద్దని.. ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోచారం ఆదేశించారు. రైతులకు సాగునీటి ప్రయోజనం చేకూరేలా పనులు చేపట్టాలని సూచించారు. బాన్సువాడ మండలం కోనాపూర్, హన్మాజీపేట్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిని పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేలా పనులు వేగవంతం చేయాలని, భవన నిర్మాణం నాణ్యతతో కూడి ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఛైర్మన్​ కాసుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related articles

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...

Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల...