అక్షరటుడే, బాన్సువాడ: Ashadam Bonalu | ఆషాఢ మాసం సందర్భంగా జిల్లాలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాన్సువాడలో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) సతీసమేతంగా బోనం ఎత్తుకున్నారు.
పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో (Sangameshwara Colony) బోనాల పండుగలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, భార్య పుష్పతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆషాఢమాసంలో బోనాల ఊరేగింపు అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని.. పాడిపంట బాగుండాలని కోరుతూ మహిళలు గ్రామాల్లో బోనాల తీస్తారని వివరించారు.
Ashadam Bonalu | రుద్రూర్లో..
రుద్రూర్ (Rudrur) మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) పాల్గొని బోనమెత్తారు. బోనాల పండుగను ప్రజలు అత్యంత ఉత్సాహంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి (Pocharam surendar Reddy) తదితరులు పాల్గొన్నారు.

బోనం ఎత్తుకున్న పోచారం భాస్కర్‌రెడ్డి