Homeజిల్లాలుకామారెడ్డిBajireddy Govardhan | రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారిన పోచారం: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి...

Bajireddy Govardhan | రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారిన పోచారం: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

తన స్వార్థం కోసమే పోచారం శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ అన్నారు. బాన్సువాడ పట్టణంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivas reddy) తన రాజకీయ లబ్ధి, స్వార్థం కోసమే పార్టీ మారారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారలేదని వ్యాఖ్యానించారు. బాన్సువాడ (banswada) పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్, రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసగించిందన్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా పరిపాలన గాడి తప్పిందని వ్యాఖ్యానించారు.

Bajireddy Govardhan | పోచారంవి రెండు మాటలు..

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని బాజిరెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని ఒకసారి, పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్​కి మరోసారి తెలపడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.

Bajireddy Govardhan | డిపాజిట్​ రాకుండా చేస్తాం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by election) బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తారని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడలో ఉపఎన్నికలు వస్తే పోచారానికి డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు. కేసీఆర్ (KCR) ఆదేశాలతో బాన్సువాడ నియోజకవర్గంపై దృష్టి పెట్టానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, అంజిరెడ్డి, నార్ల రత్న కుమార్, మూచి గణేష్, సాయిబాబా, బోడ రామచందర్, నాయిని మొగులయ్య, గులిపల్లి మొగులయ్య, శివ, గౌస్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.