అక్షరటుడే, బాన్సువాడ: Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం తల్లితండ్రులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy), పుష్పలకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ ఆశీర్వాదం తీసుకున్నారు. నియోజవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలు అభిమానులు, నాయకులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
Pocharam Bhaskar Reddy | కోటగిరిలో..
అక్షరటుడే,కోటగిరి: ఉమ్మడి మండల కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైనారిటీ స్కూల్లో (minority school) విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ (AMC) ఛైర్మన్ హన్మంత్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, సిరాజుద్దీన్, ఏజాజ్ ఖాన్, వర్ని శంకర్, మైనారిటీ యాక్టీవ్ లీడర్ జుబేర్, మాణిక్అప్ప, రాజు, రాంబాబు, శివరాజ్, ధన్రాజ్, నభి, దత్తు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు