అక్షరటుడే, ఇందల్వాయి: Chandrayanpalli | మండలంలోని చంద్రాయన్పల్లి (Chandrayanpalli) గ్రామంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ పండుగను (Pochamma Panduga) ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి పోచమ్మ తల్లికి బోనం తీసి ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.
బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గ్రామదేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పాడిపంటలు బాగా ఉండాలని చిన్నపిల్లలకు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పోచమ్మ పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు పాల్గొన్నారు.
