ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​SBI Recruitment | ఎస్‌బీఐలో పీవో కొలువు.. 14తో ముగియనున్న దరఖాస్తు గడువు

    SBI Recruitment | ఎస్‌బీఐలో పీవో కొలువు.. 14తో ముగియనున్న దరఖాస్తు గడువు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI Recruitment | ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌బీఐ(SBI) ప్రొబెషనరీ ఆఫీసర్‌(Probationary Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 541 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14వ తేదీతో గడువు ముగియనుంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలు..

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 541.
    రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు.. అన్‌రిజర్వ్‌డ్‌ : 203, ఓబీసీ : 135, ఎస్సీ : 80, ఎస్టీ : 73, ఈడబ్ల్యూఎస్‌ 50)

    విద్యార్హత: ఏదైనా డిగ్రీ(Any degree) ఉత్తీర్ణత (ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి డిగ్రీ పూర్తవ్వాలి)
    వయో పరిమితి: 21 నుంచి 30 ఏళ్లు (01.04.2025 నాటికి). ఓబీసీ(OBC)లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం: ప్రారంభ మూల వేతనం రూ. 48,480.

    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
    దరఖాస్తుకు చివరి తేదీ: ఈనెల 14.

    ఎంపిక ప్రక్రియ :
    ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది.
    ఫేజ్‌ 1లో వంద మార్కులకు ప్రిలిమినరీ(Preliminary) పరీక్ష ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. ఇది ఈనెలాఖరులో లేదా ఆగస్టులో ఉండే అవకాశాలున్నాయి. 60 నిమిషాలలో పూర్తి చేయాల్సిన ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కు(Negative marks)లుంటాయి. ప్రతి తప్పు సమాధానికి పావు మార్కు కోత విధిస్తారు. అయితే ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
    ఫేజ్‌ 2లో 250 మార్కులకు మెయిన్‌(Main) ఎగ్జామ్‌ ఉంటుంది. ఇది సెప్టెంబర్‌లో ఉండే అవకాశాలున్నాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ పరీక్షకు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు.
    ఫేజ్‌ 3 లో ఇంటర్వ్యూ(Interview), గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ ఉంటాయి.
    అభ్యర్థులు ఫేజ్‌ 2లో పొందిన మార్కులు, ఫేజ్‌ 3లో సాధించిన మార్కులతో కలిపి తుది జాబితా రూపొందిస్తారు. కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు.

    దరఖాస్తు, ఇతర వివరాలకు https://sbi.co.in/careers వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...