Homeజిల్లాలునిజామాబాద్​BJP OBC Morcha | ఓబీసీ మోర్చా అర్బన్​ శాఖ ఆధ్వర్యంలో పీఎం జన్మదిన వేడుక

BJP OBC Morcha | ఓబీసీ మోర్చా అర్బన్​ శాఖ ఆధ్వర్యంలో పీఎం జన్మదిన వేడుక

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BJP OBC Morcha | నగరంలో ఓబీసీ మోర్చా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పీఎం మోదీ(PM Modi) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోల్​ హనుమాన్ (Goal Hanuman)​ చౌరస్తాలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎం మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రతిఒక్కరికి వివరించే బాధ్యత బీజేపీ కార్యకర్తలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ దుద్దోల్ల గిరిబాబు, ఓబీసీ మోర్చా నాయకులు శీల శ్రీనివాస్, ఐటీ సెల్ అర్బన్ కన్వీనర్ రాజ్​కుమార్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.