ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | ఏపీకి ప్రధాని మోదీ.. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

    PM Modi | ఏపీకి ప్రధాని మోదీ.. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ PM Modi మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి Amaravati కి రానున్నారు. అమరావతిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ఎస్పీజీ SPG కమాండోలు సైతం అమరావతికి చేరుకున్నారు. మోదీ భద్రతా దళం ఆయన పర్యటించే ప్రాంతాలను పరిశీలిస్తోంది. రాష్ట్ర పోలీసులతో భద్రతా ఏర్పాట్లపై వారు చర్చించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Chandra Babu nayudu సైతం ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు, అధికారులతో కమిటీలు వేసి.. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు..

    PM Modi | ప్రధాని పర్యటన షెడ్యూల్​..

    మే 2వ తేదీన తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరి ప్రధాని మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి వస్తారు. 3.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని.. అక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి పయనం అవుతారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...