HomeUncategorizedYoga day | ప్ర‌పంచ దేశాల‌ను ఏకం చేసిన యోగా.. విశాఖ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

Yoga day | ప్ర‌పంచ దేశాల‌ను ఏకం చేసిన యోగా.. విశాఖ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga day | ప్ర‌పంచ దేశాల‌ను ఏకం చేసింది యోగా మాత్ర‌మేన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(Pm Narendra modi) అన్నారు. 175కుపైగా దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని గుర్తు చేశారు. ఇది మనతోనే సాధ్యమైందన్నారు. యోగా(Yoga) ద్వారా కోట్ల మంది జీవనశైలి మారిపోయిందని వెల్లడించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga day) సందర్భంగా శ‌నివారం విశాఖ‌ప‌ట్నం(visakhapatnam)లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు యోగాస‌నాలు వేశారు. అనంత‌రం ప్ర‌ధాని మాట్లాడుతూ.. ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Yoga day | యోగాతో ఒత్తిడి దూరం

యోగా ప్రాముఖ్యతను, ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తుందో, అది శాంతిని ఎలా తెస్తుందో ప్రధాని మోదీ ఈ సంద‌ర్భంగా వివరించారు. దురదృష్టవశాత్తు నేడు ప్రపంచం మొత్తం ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, అనేక రంగాలలో అశాంతి. అస్థిరత పెరుగుతోందన్న ప్ర‌ధాని.. అటువంటి పరిస్థితిలో, యోగా మనకు శాంతిని చేకూరుస్తుంద‌న్నారు. “అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga day) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు, మొత్తం ప్రపంచం యోగా చేస్తోంది. యోగా అంటే జోడించడం అని అర్థం, యోగా మొత్తం ప్రపంచాన్ని ఎలా అనుసంధానించిందో చూడటం చాలా ఆనందంగా ఉందని” తెలిపారు.

Yoga day | ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం

ఈ సంవత్సరం ఎంచుకున్ న‌థీమ్ ‘ఒక భూమి కోసం యోగా, ఒకే ఆరోగ్యం అంద‌రి’ ప్ర‌జ‌లంద‌రి మ‌ధ్య లోతైన పరస్పర సంబంధాన్ని హైలైట్ చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “భూమిపై ఉన్న ప్రతి జీవి ఆరోగ్యం పరస్పరం అనుసంధానించబడి ఉంది. మానవ శ్రేయస్సు మన ఆహారాన్ని పెంచే నేల ఆరోగ్యం. మనకు నీటిని ఇచ్చే నదులు, మన పర్యావరణ వ్యవస్థలను పంచుకునే జంతువుల ఆరోగ్యంజ‌ మనల్ని పోషించే మొక్కల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని” వివ‌రించారు. యోగా శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ సమతుల్యతపై అవగాహనను కూడా పెంచుతుందన్నారు. “యోగా మనల్ని ఈ పరస్పర అనుసంధానానికి మేల్కొలిపి, మనం ఒంటరి వ్యక్తులు కాదని, ప్రకృతిలో భాగమని మనకు బోధిస్తుంది” అని మోదీ తెలిపారు.

ప్రపంచ ఐక్య‌త‌కు యోగా సాధ‌నం

మ‌న భార‌తీయ వార‌స‌త్వ‌మైన యోగా.. దేశం దాటి సరిహద్దులను చెరిపేసింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. యోగా ప్రపంచ ఐక్యతకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ దినచర్యలో యోగాను భాగం చేసుకున్నారు. “యోగా సరళమైన అర్థం చేరడం” అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ యోగా ఉద్యమంలో కొత్త అధ్యాయానికి పిలుపునిస్తూ, ప్రధానమంత్రి మోదీ ప్రపంచాన్ని “మానవత్వం కోసం యోగా 2.0″ను ప్రారంభించాలని కోరారు. ఇక్కడ అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారుతుంది. “యోగా సరిహద్దులు, నేపథ్యాలు, వయస్సు లేదా సామర్థ్యానికి అతీతంగా అందరికీ ఉంటుంది” అని ఆయన వివ‌రించారు. “అన్ని నేవీ నౌకలలో అద్భుతమైన యోగా కార్యక్రమం నిర్వహించబడుతోంది” అని తెలిపారు. 2014లో ఐక్యరాజ్యసమితికి భారతదేశం చేసిన ప్రతిపాదనను గుర్తు చేసిన ప్ర‌ధాని మోదీ.. “జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని భారతదేశం ప్రతిపాదించినప్పుడు, తక్కువ సమయంలోనే 175 దేశాలు దానిని అంగీకరించాయి. నేటి ప్రపంచంలో ఈ ఐక్యత. మద్దతు సాధారణ సంఘటన కాదు” అని పేర్కొన్నారు. సిడ్నీ ఒపెరా హౌస్ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు, సముద్రపు లోతు వరకు, అదే సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని మోదీ అన్నారు.