PM Modi Tour
PM Modi Tour | ప్ర‌ధాని మోదీ విదేశీ సుదీర్ఘ‌ పర్య‌ట‌న‌.. 8 రోజులు, 5 దేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi Tour | భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం (జులై 2) నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాలకు సుదీర్ఘ పర్యటనను ప్రారంభించారు. ఇది గత దశాబ్దంలోనే మోదీ చేపట్టిన అత్యంత విశిష్టమైన విదేశీ పర్యటనగా భావిస్తున్నారు. ఆయన ఈ పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం మోదీ ముఖ్య ఉద్దేశం. అంతేకాక, గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం గురించి అలానే ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించే విషయంలో ప్రధానమంత్రి దృష్టి కేంద్రీకరించనున్నారు.

PM Modi Tour | సుదీర్ఘ టూర్..

జులై 2-3లలో ఘనా పర్యటన ఉంటుంది. మూడు దశాబ్దాల (three decades) తర్వాత భారత ప్రధాని (Narendra Modi) ఈ పర్యటన చేయడం ఇదే తొలి సారి. ఈ పర్యటనలో ఘనా అధ్యక్షుడు జాన్ మహామాతో మోదీ భేటీ అవుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో (defence sector) భాగస్వామ్యం గురించి చర్చలు జ‌రుపుతారు. వ్యాక్సిన్‌ హబ్‌ (vaccine hub) ఏర్పాటుకు తన మద్దతు ప్ర‌కటించనున్నారు. ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక జులై 3-4: ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన చేప‌ట్ట‌నున్నారు. కరీబియన్ ద్వీపదేశమైన ట్రినిడాడ్‌లో 1999 తర్వాత భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా (President Christine) కంగలూ, ప్రధాని కమ్లా పెర్సాద్‌తో మోదీ సమావేశం కానున్నారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగం ఉంటుంది. ఆరోగ్యం, డిజిటల్ రంగం, రక్షణ, విద్య, ఇంధనం అంశాలపై సహకార చర్చలు ఉంటాయి.

జులై 4-5: అర్జెంటీనా పర్యటన (Argentina tour) ఉంటుంది. ఈ పర్య‌ట‌న‌లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో (resident Javier Migli) వ్యూహాత్మక చర్చలు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, పునరుత్పాదక శక్తి తదితర రంగాల్లో సహకారం ప్రధాన అంశంగా ఉంటుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. జులై 5-8: బ్రెజిల్ పర్యటన ఉంటుంది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర (BRICS Summit) సమావేశానికి హాజ‌ర‌వుతారు. మోదీ నాలుగోసారి బ్రెజిల్‌కు పర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. 2026లో భారత్ BRICS అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఈ సమావేశం కీలకంగా మారింది.

జులై 8-9: నమీబియా పర్యటన ఉంటుంది. భారత ప్రధాని నమీబియాకు ఇది మూడో పర్యటన. అధ్యక్షురాలు నెతుంబో నంది-నదిత్వాతో (President Netumbo Nandi-Nditwa) ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి. నమీబియా పార్లమెంటులో ప్రసంగం, అనంత‌రం గ్రీన్ ఎనర్జీ, వాటర్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ పేమెంట్ వ్యవస్థపై చర్చ. ఈ పర్యటన ద్వారా భారత్ (Inida) తన గ్లోబల్ లీడర్‌షిప్‌ను మరింతగా ప్రదర్శించనుందని, కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా పేర్కొంది. బ్రిక్స్ సదస్సుతో పాటు, ద్వైపాక్షిక పర్యటనల్లోనూ మోదీ ప్రాధాన్యత చాటుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.