HomeUncategorizedPM Modi | మ‌హానాడులో ష‌డ్రుచులు.. వంట‌ల‌పై మోదీ ఆరా తీశారా..!

PM Modi | మ‌హానాడులో ష‌డ్రుచులు.. వంట‌ల‌పై మోదీ ఆరా తీశారా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు మ‌హానాడు Mahanadu నిర్వ‌హించ‌నుంది. టీడీపీ మహానాడు అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సంప్రదాయంగా మహానాడు నిర్వహిస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

దాదాపు 40 ఏళ్లలో ఒకటి రెండు సందర్భాలు తప్ప.. ఎప్పుడూ టీడీపీ మహానాడు మిస్ అవ్వలేదు. ఇక గత ఏడాది ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహానాడును టీడీపీ(TDP) వాయిదా వేసింది.ఈ సారి మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అయితే మ‌హానాడులో అంద‌రినీ అమితంగా ఆక‌ర్షించేది ష‌డ్రుచులే.. అతిథులు, కార్య‌కర్త‌లు, నాయ‌కుల సంఖ్య‌తో సంబంధం లేకుండా.. ఉజ్జాయింపుగా ఓ సంఖ్య‌ను అనుకుని ప్ర‌త్య‌కంగా వంట‌కాలు చేయిస్తారు.

PM Modi | ప్ర‌త్యేక వంట‌కాలు..

దీని కోసం ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వంట‌కాల్లో నిపుణులైన వారిని ర‌ప్పిస్తారు. పార్టీ అధినేత నియ‌మించిన క‌మిటీ రుచి చూస్తుంది. సంతృప్తి చెందితేనే వాటిని వ‌డ్డిస్తారు. ఇక‌, ఈ వంట‌కాలు కూడా ప్ర‌త్యేకంగా ఉంటాయి. సీజ‌న‌ల్ గా వ‌చ్చే కూర‌గాయ‌ల‌ను తాజావి అప్ప‌టిక‌ప్పుడు తెప్పించి వంట‌కాలు చేయిస్తారు.ఆంధ్ర మాత గోంగూర‌తో క‌లిపి నాన్ వెజ్‌, వెజ్‌వంట‌కాలు.. నోరూరిస్తాయి.

అంతేకాదు.. రోజూ ఉద‌యం టిఫిన్‌లోనే నాలుగు నుంచి ఆరు ర‌కాలు ఉంటాయి. ఇడ్లీ, వ‌డ‌, ఉప్మా, క‌ట్టి పొంగ‌లి, దోశ‌లు (ఆరు ర‌కాలు) వ‌ర‌కు అప్ప‌టిక‌ప్పుడు వేడివేడి పొగ‌లు క‌క్కుతున్న స‌మ‌యంలోనే వ‌డ్డిస్తారు. వీటిలోకి నాలుగు ర‌కాల చ‌ట్నీలు, సాంబారు కూడా రెడీ అవుతాయి. అయితే నీతి అయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu)ను మహానాడు ప్రాధాన్యం, ప్రత్యేకతలపై పీఎం మోదీ PM modi అడిగి తెలుసుకున్నారట..!

దాదాపు 5 నిమిషాల పాటు మహానాడు(Mahanadu) సంగతులను తెలుసుకోడానికే మోదీ ఆసక్తి కనబరిచారంటున్నారు. తనకు బాగా ఇష్టమైన మహారాష్ట్ర(Maharashtra) వంటకాన్ని కూడా మెనూలో చేర్చాలని సూచించారని అంటున్నారు. ప్రధాని సూచనలతో సీఎం చంద్రబాబు భోజన ఏర్పాట్లలో కొద్ది మార్పులు చేయాలని సూచించారని సమాచారం. ప్రధాని మోదీ(Prime Minister Modi)కి త్రుణధాన్యాలతో తయారు చేసే వంటకాలు అంటే చాలా ఇష్టమట. దీంతో మ‌హానాడుకు వ‌చ్చే అతిథుల‌కు తృణ‌ధాన్యాల‌తో చేసిన వంట‌కాలు రుచి చూపించాల‌ని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబును Chandra babu కోరార‌ని సమాచారం. త్రుణధాన్యాల వంటకాలను చేసే నిపుణులతో సంప్రదించాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇక మహానాడు భోజన ఏర్పాట్లను టీడీపీ జర్మనీ (Tdp Germany Wing) విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి మ‌హానాడు తెలుగు త‌మ్ముళ్లకి ఫుల్ జోష్ తీసుకురావడం ఖాయం.