అక్షరటుడే, ఆర్మూర్: Armoor BJP | ప్రధాని మోదీ (Prime Minister Modi) రైతులు పక్షపాతి అని బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, జిల్లా రైతు నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గైని గురుడి రెడ్డి సంఘంలో ఉత్తమ రైతులను సన్మానించారు.
Armoor BJP | రైతులకు ఎన్నో పథకాలు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (central government) రైతులకు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి రూ. 5వేలు అందిస్తున్నారన్నారు. ఫసల్ బీమా యోజనలో భాగంగా రైతులు నష్టపోతే బీమా అందిస్తున్నారని.. ఎరువుల బస్తాపై సబ్సిడీలు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనిల్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శేషగిరి లింగం, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ఉపాధ్యక్షుడు దొండి ప్రకాష్, కార్యదర్శి ప్రసన్న గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, మిరియాల్కర్ కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.