ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Amaravati | ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌తో ఆంక్ష‌లు.. అమరావతి సభకు వచ్చే వాహనదారులకు సూచనలివే..

    Amaravati | ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌తో ఆంక్ష‌లు.. అమరావతి సభకు వచ్చే వాహనదారులకు సూచనలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amaravati | భారత ప్రధాని నరేంద్ర మోదీ Modi నేడు ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతికి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు.

    Amaravati | భారీ ఏర్పాట్లు..

    ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. నేటి కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చే వారి కోసం 3531 ఆర్టీసీ బస్సులు, 4050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దూరప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి Amaravati పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసే వాహనదారులకు పోలీసులు కొన్ని సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. MIP/ VVIP/ VIP వాహనాల దారులు ప్రకాశం బ్యారేజ్ – లోటస్ పాయింట్ – కరకట్ట — సీడ్ యాక్సెస్ రోడ్(E3) – N9 జంక్షన్ – సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ వీరి కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో గల P8 మరియు P9 సెక్టార్లలో పార్కింగ్ చేయాలి.

    VIP లతో పాటు A+ వాహనదారులు ప్రకాశం బ్యారేజ్ – స్క్రూ బ్రిడ్జి – ఉండవల్లి సెంటర్ — ఉండవల్లి గుహలు రోడ్డు నుండి కుడివైపు తిరిగి – ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రక్కన గల రోడ్డు (కరకట్ట ప్రక్కన ఉన్న రోడ్డు) ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు (E 3 ) చేరుకుని – N10 జంక్షన్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభాస్థలం వెనుక ఏర్పాటు చేసిన పార్కింగ్ Parking స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. Route No -1:- కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రూట్ నంబర్ – 1 రహదారిలో గొల్లపూడి నుంచి పశ్చిమ బైపాస్ నవయుగ బ్రిడ్జి మీదుగా వెంకటపాలెం వద్ద సర్వీస్ రోడ్డులోకి రావాలి. అక్కడి నుండి మందడం ఆర్ అండ్ బి రోడ్డు గుండా N7 జంక్షన్ (మందడం పెట్రోల్ బంక్ సమీపంలో) ద్వారా కుడివైపునకు తిరిగి పార్కింగ్ నంబర్ – 06 నందు పార్కింగ్ చేయాలి.

    Route No – 2 : కృష్ణా జిల్లా నుంచి రూట్ నంబర్ – 2 ద్వారా వచ్చే వాహనాలు వారధి – తాడేపల్లి హైవే – మయూరి టెక్ పార్క్ డౌన్ – ఎన్నారై అండర్ పాస్ – నేతన్న సర్కిల్ – డాన్ బాస్కో స్కూల్ మీదుగా ఎర్రబాలెం – కృష్ణయ్య పాలెం – Z’ 0 జంక్షన్ E8 రోడ్డు నుంచి పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకోవాలి. Route No – 3:- గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి రూట్ నంబర్- 3 ద్వారా వచ్చే వాహనదారులు కాజా టోల్ గేట్ సర్వీస్ రోడ్డు – మురుగన్ హోటల్ ఎడమ వైపు తిరిగి వెస్ట్ బైపాస్ మీదుగా N6 – E11 జంక్షన్ – N9 జంక్షన్ E8 – N9 జంక్షన్ ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకోవాలని సూచించారు.

    Route No – 4: గుంటూరు నుంచి రూట్ నెంబర్- 04 ద్వారా వచ్చే వాహనదారులు గుంటూరు – తాడికొండ రోడ్డు – తాడికొండ పెద్దపరిమి – E6 రోడ్డు ప్రారంభం (తుళ్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్) – N 11 – E 7 జంక్షన్ – E7 – N10 రోడ్ నుంచి పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకోవ‌ల‌సి ఉంటుంది. Route No – 5:- పల్నాడు జిల్లా నుంచి రూట్ నెంబర్ – 05 ద్వారా వచ్చే వాహనాలు అమరావతి – పెద్ద మద్దూరు – వైకుంటపురం – బోరుపాలెం – దొండపాడు – రాయపూడి Y జంక్షన్ – MLA క్వార్టర్స్ – న్యూ పార్క్ రోడ్డు – E6 – N11 జంక్షన్ నుండి N11 – E7 జంక్షన్ – E7 – N10 రోడ్డు ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్- 01 చేరుకోవాలి.

    గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి – వేమూరు- కొల్లూరు – వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తున్నారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తున్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...