ePaper
More
    HomeజాతీయంPM Modi | భారత్​ బలాన్ని ప్రపంచం గుర్తించింది : ప్రధాని మోదీ

    PM Modi | భారత్​ బలాన్ని ప్రపంచం గుర్తించింది : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | భారత్​ బలాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం(Union Government) 16వ రోజ్‌ గార్ మేళా(Rose Gar Mela)ను శనివారం నిర్వహించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 51 వేల మంది యువతకు మోదీ వర్చువల్(Modi Virtual)​గా నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గత 11 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

    PM Modi | పేదల సంక్షేమమే ధ్యేయం

    పేదల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం (BJP government) పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు. పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 10 కోట్లకు పైగా కొత్త ఎల్​పీజీ కనెక్షన్ల పంపిణీ చేశామన్నారు. గత పదేళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయట పడ్డారని ఆయన పేర్కొన్నారు. వారికి ఉపాధి, ఆదాయ వనరులు లభించడంతో ఇది సాధ్యమైందని ప్రధాని తెలిపారు.

    PM Modi | రూ.1.25 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు

    ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత రక్షణ రంగం తయారీ గురించి ప్రపంచం మొత్తం చర్చిస్తోందన్నారు. రక్షణ ఉత్పత్తి విలువ రూ. 1.25 లక్షల కోట్లకు మించిపోయిందని ఆయన అన్నారు. ఇటీవల మోదీ ఐదు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటన గురించి మాట్లాడుతూ.. భారతదేశం జనాభా, ప్రజాస్వామ్యం బలాన్ని ప్రపంచం మొత్తం ఇప్పుడు గుర్తించిందన్నారు. యువతే దేశానికి బలమని, అతి పెద్ద మూలధనం అని ప్రధాని (PM Modi) వివరించారు.

    PM Modi | పది లక్షల ఉద్యోగాలు

    యువత సాధికారత, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యం కోసం రోజ్‌గార్ మేళా (Rozgar Mela) కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. దీని కింద ఇప్పటివరకు 10 లక్షలకు పైగా నియామక లేఖలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాలన, జాతీయ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమన్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...