అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం విడుదల చేయనున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఏటా రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి మూడు సార్లు రూ.రెండు వేల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. తాజాగా 20 విడత నిధులను ప్రధాని మోదీ జమచేయనున్నారు.
PM Kisan | 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో..
దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) నిధులు జమ చేయనుంది. మొత్తం రూ.20,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) రైతులకు రైతు భరోసా విడుదల చేసింది. తాజాగా కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఖాతాల్లో వేయనుండటంతో రైతులు ఆనంద పడుతున్నారు.
PM Kisan | ఈ కేవైసీ చేసుకుంటేనే..
పీఎం కిసాన్(PM Kisan) నిధులు ఈ కేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే జమ కానుంది. ఒకవేళ కేవైసీ చేసుకోకున్నా.. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ లేకున్నా.. డబ్బులు జమ కావు. రైతులు ఆన్లైన్ కేవైసీ స్టాటస్ చెక్ చేసుకొని.. ఒకేవళ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
PM Kisan | ఇలా చెక్ చేసుకోవాలి
పీఎం కిసాన్ నిధులు ఖాతాలో జమ అయ్యాయో లేదో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. https://pmkisan.gov.in వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. వెబ్సైట్ ఓపెన్ చేశాక.. Farmers Corner విభాగంపై క్లిక్ చేయాలి. అనంతరం Beneficiary Status పై క్లిక్ చేసి రైతు వివరాలు ఎంటర్ చేస్తే డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుస్తుంది.