అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM kisan | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) Pm Kisan పథకం కింద అర్హులైన రైతులకు (elgibel farmers) ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం (credit on farmers bank account) జరుగుతుంది. ఇప్పటివరకు 19 విడతల్లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల (central governament PM kisan funds released) చేసింది. 20వ విడుత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటిలోగా ముందస్తుగానే రైతులు రిజిస్ట్రేషన్ (registration) చేసుకుని ఉండాలి. మే 31వ తేదీలోపు ఆ పని పూర్తి చేయాలి. తద్వారా ఈ పథకానికి లబ్ధి పొందుతారు .
PM kisan | నిధుల మంజూరు..
ప్రతి 4 నెలలకు 3 వాయిదాలలో రూ. 2 వేలు అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ నగదు DBT బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటివరకు, ప్రధానమంత్రి కిసాన్ యోజన (pradhan mantri kisan yojana) 19 వాయిదాలను ప్రభుత్వం (governament) విడుదల చేసింది. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలో రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన (Pradhan Mantri Kisan Yojana) 20వ విడతను పొందుతారు. రైతు రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులకు మాత్రమే 20వ విడత విడుదల అవుతుంది.అర్హత ఉన్న రైతులందరినీ ఈ పథకంతో ఇంటిగ్రేట్ చేసేందుకు మే 31 వరకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ (PM kisan) 20వ విడత కోసం లబ్ధిదారు రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ-కేవైసీ (e-kyc), ల్యాండ్ వెరిఫికేషన్ (land verification), బ్యాంక్ అకౌంట్-ఆధార్ లింక్ (bank account aadhar link) చేయడం వంటివి ఉన్నాయి.
దీని కోసం ముందుగా మీరు చేయాల్సింది. పీఎం కిసాన్ pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి (website) వెళ్లండి. రైతు Farmer Corner కి వెళ్లి e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ (verification) తర్వాత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయండి.
e-KYC పూర్తవుతుంది. రైతు ఖాతాలో NPCI పూర్తి చేసుకోవాలి. NPCI లింక్ కోసం మీ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డుతో మీ సమీప బ్యాంక్ శాఖను సంప్రదించవచ్చు. ల్యాండ్ వెరిఫికేషన్ (land verification) ఎలా చేస్తారు అంటే…మీ సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లండి. దరఖాస్తు ఫారమ్ తీసుకొని అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. ఇందులో మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ (PM kisan registration number), వ్యవసాయ సంబంధిత పత్రాలు (agriculture documents) మొదలైనవి ఉండవచ్చు. దరఖాస్తు, పత్రాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. మీ దరఖాస్తు ఆమోదం పొందితే మీకు భూమిని అప్పగిస్తారు.