అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ టీమ్‌ను (Womens Cricket Team) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జట్టు సభ్యులతో ఆయన బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్లేయర్లతో మాట్లాడారు. కప్ గెలిచిన వారిని అభినందించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని క్రికెటర్ హర్లీన్ డియోల్ (Cricketer Harleen Deol) వేసిన ప్రశ్న అక్కడ నవ్వులు పూయించింది. ‘మీ స్కిన్‌కేర్ రహస్యమేంటో మాకు చెప్పగలరా?’ అని నవ్వుతూ ఆమె ప్రధానిని అడిగింది. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను వాటి గురించి ఆలోచించను అని చెప్పారు.
PM Modi | ఘన స్వాగతం
ప్రపంచ కప్ విజయం తర్వాత మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలో ఆదివారం నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజ్ ప్యాలెస్ హోటల్‌కు (Taj Palace Hotel) చేరుకున్న తర్వాత, క్రీడాకారులు మరియు సహాయక సిబ్బంది గులాబీ రేకులు, చీర్స్‌తో స్వాగతం పలికారు. జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ మరియు స్నేహ్ రాణా వంటి తారలు ధోల్ బీట్‌లకు డ్యాన్స్ చేశారు. ప్రత్యేక స్టార్ ఎయిర్ చార్టర్ విమానంలో వారు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన అధికారిక నివాసంలో విజేత జట్టుకు ఆతిథ్యం ఇచ్చారు. ఫైనల్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని జేబులో వేసుకోవడం గురించి మోదీ మాట్లాడారు. దానికి ఆమె సమాధానం ఇస్తూ.. అదృష్టం కొద్ది బంతి తన వద్దకు వచ్చిందన్నారు. దీంతో దానిని ఉంచుకున్నట్లు తెలిపారు.
