Homeజిల్లాలునిజామాబాద్​Nandipet | వ్యభిచార దందా పట్టించాడని పగ.. హత్యకు స్కెచ్!​

Nandipet | వ్యభిచార దందా పట్టించాడని పగ.. హత్యకు స్కెచ్!​

Nandipet | తనను చంపడానికి కొందరు కుట్ర చేశారని ఓ వ్యక్తి నందిపేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nandipet | వ్యభిచార దందా నిర్వహిస్తున్న తమను పట్టించాడని పగ పెంచుకున్న కొందరు ఓ వ్యక్తిని చంపడానికి ప్లాన్​ చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఏడాది జనవరిలో నందిపేట మండలం లక్కంపల్లి (Lakkampalli) శివారు ప్రాంతంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు విటులను పట్టుకున్నారు. 8 మంది మహిళలను రక్షించారు. దీనిపై నందిపేట పోలీస్​ స్టేషన్​ (Nandipet Police Station)లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు నమోదు కావడానికి లక్కంపల్లి గ్రామంలోని భరత్​నగర్​కు చెందిన మేకల మహేశ్​ కారణమని మేకల ప్రకాశ్​ పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలో పలుమార్లు మహేశ్​తో గొడవ పడ్డాడు. చంపుతానని బెదిరించాడు. అనంతరం ఆయనకు పరిచయమైన ఓ మహిళ, నర్సయ్య అలియాస్​ పెయింటర్​ దేవాతో కలిసి ప్రకాశ్​ మేకల మహేశ్​ను చంపాలని ప్లాన్​ వేశాడు. ఇందుకు సంబంధించిన వాయిస్​ రికార్డులను బాధితుడు మహేశ్​ పోలీసులకు అప్పగించి శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్​ తెలిపారు.