అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indus River | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌పై చర్యలు చేపట్టింది. ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్యాలను Trades రద్దు చేసుకుంది. అంతేగాకుండా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని Indus Water Treaty కూడా రద్దు చేసింది. పాకిస్తాన్‌కు సింధూ నది జలాలు వెళ్లకుండా గేట్లు మూసేసింది.
Indus River | ఆ నీరే కీలకం
పాకిస్తాన్ pakistan తాగు, సాగు నీటికి సింధూ నది నీరే కీలకం. సింధూ నది జలాలు ఆపేస్తే పాకిస్తాన్ ఏడారి అవుతుంది. అసలే ఎండాకాలం కావడంతో దాయాది దేశం నీటి ఎద్దడిని ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో బుధవారం భారత్‌కు లేఖ రాసింది. సింధూ జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని లేఖలో కోరింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్ పేర్కొంది.
Indus River | రక్తం–నీరు కలిసి ప్రవహించలేవు..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ operation sindoor చేపట్టి పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాక్ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో భారత్‌పై దాడి చేయగా మన రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అనంతరం భారత్ ప్రతిదాడులతో పాక్ తీవ్రంగా నష్టపోయింది.
ఈ క్రమంలో రెండు దేశాలు కాల్పుల విరమణ ceasefireకు అంగీకరించాయి. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోదీ pm modi మాట్లాడుతూ.. రక్తం–నీరు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు ఆ దేశానికి నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆ దేశంతో పీవోకే pok, ఉగ్రవాదంపై తప్ప ఇతర విషయాలపై చర్చించమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాక్ లేఖపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
