- Advertisement -
Homeక్రీడలుInd-Pak Match | ఆసియా కప్ 2025: ఇండియా–పాక్ మ్యాచ్‌లను రైవల్రీ అనకండి.. సూర్యకుమార్ యాదవ్...

Ind-Pak Match | ఆసియా కప్ 2025: ఇండియా–పాక్ మ్యాచ్‌లను రైవల్రీ అనకండి.. సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind-Pak match | దుబాయ్‌లో ఆదివారం (సెప్టెంబర్ 21, 2025) జరిగిన ఆసియా కప్ సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భార‌త్ (India) ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

ఈ విజ‌యం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వరుసగా పాకిస్థాన్‌ను (Pakistan) తేలికగా ఓడిస్తున్న నేపథ్యంలో, ఇకపై ఈ మ్యాచ్‌లను “రైవల్రీ” అని పిలవకూడదని ఆయన సూచించారు. మీడియా సమావేశంలో ఒక పాకిస్థానీ జర్నలిస్ట్ “ఇరు జట్ల మధ్య స్థాయి వ్యత్యాసం చాలా పెరిగిపోయిందా?” అని ప్రశ్నించగా, సూర్యకుమార్ నవ్వుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

- Advertisement -

Ind-Pak Match | ఇదేమి రైవ‌ల్రీ..

“సర్, నా అభ్యర్థన ఒక్కటే.. ఇండియా–పాక్ మ్యాచ్‌లను ఇకపై రైవల్రీ అని పిలవకండి. రైవల్రీ అంటే ఏమిటంటే, రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడి స్కోరు 8–7గా ఉంటే అదే రైవల్రీ. ఇక్కడ పరిస్థితి 12–3, లేదా 13–1లా ఉంది. ఇందులో పోటీ లేదు అంటూ చిరు న‌వ్వులు చిందిస్తూ కామెంట్ చేశారు సూర్య కుమార్ (Surya Kumar Yadav). గ‌ణాంకాలు చూస్తే.. ఇప్పటివరకు భారత్–పాక్ జట్లు 15 సార్లు T20Iల్లో తలపడ్డాయి . అందులో 12 మ్యాచ్‌లు భారత్ గెలవగా, కేవలం 3 సార్లు మాత్రమే పాకిస్థాన్ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా జ‌రిగిన సూపర్–4 మ్యాచ్‌లోనూ భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి పాకిస్తాన్‌కి గ‌ట్టిగా బుద్ది చెప్పింది.

సూర్యకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కొందరు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది పాకిస్థాన్ క్రికెట్ స్థాయిపై సరదాగా వేసిన జోక్ అని కామెంట్ చేస్తున్నారు. కాగా, లీగ్ మ్యాచ్‌లో భాగంగా పాక్‌తో మ్యాచ్ ఆడిన భార‌త్ అప్పుడు ఘ‌న విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఇండియ‌న్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ (Shake hand) ఇవ్వకుండా భారత్ తమ నిరసనను తెలియజేయడం హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన సూర్య కుమార్ యాద‌వ్.. ఆ గెలుపుని భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు కూడా తాము అండగా ఉంటామని చెబుతూ వారికి సంఘీభావం తెలియజేశాడు. దేశం కంటే క్రీడాస్ఫూర్తి తమకు ఎక్కువ కాదంటూ తెలియ‌జేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు సూర్య‌.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News