అక్షరటుడే, భీమ్‌గల్: CM Cup Tournament | క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి మండల స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ, జిల్లాస్థాయి పోటీల్లోనూ రాణించి బహుమతులు అందుకోవాలని వేల్పూర్ సర్పంచి మొండి అశోక్ పిలుపునిచ్చారు. భీమ్‌గల్ మండల కేంద్రంలో శుక్రవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడల (CM Cup mandal-level sports competitions) ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
CM Cup Tournament | ప్రతిభను వెలికి తీసేందుకే..
ఈ సందర్భంగా సర్పంచి అశోక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుందని, దానిని వెలికితీసేందుకే ప్రభుత్వం ఇలాంటి పోటీలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీవో బాలకృష్ణ, ఎంఈవో రేణుకతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు.
CM Cup Tournament | విజేతలు వీరే..
- కబడ్డీ (Kabaddi category) బాలుర విభాగంలో వేల్పూర్ జట్టు ప్రథమ స్థానం సాధించగా.. లక్కోరా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.
- కబడ్డీ బాలికల విభాగంలో అంక్సాపూర్ ప్రథమ, మోతె ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
- వాలీబాల్ పోటీల్లో లక్కోరా జట్టు విజేతగా, వేల్పూర్ రన్నరప్‌గా నిలిచాయి.
- ఖో-ఖో బాలుర విభాగంలో వేల్పూర్ ప్రథమ, పచ్చల నడ్కుడ ద్వితీయ స్థానంలో ఉంది. బాలికల విభాగంలో పడగల్ జట్టు ప్రథమ, వేల్పూర్ జట్టు ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నాయి.