అక్షరటుడే, వెబ్‌డెస్క్: plastic bottles | దూర ప్రయాణాల్లో ఉన్నప్పుడు దారి మధ్యలో వాటర్ బాటిల్ కొనడం అందరికీ అలవాటే. బస్సులోనో, కారులోనో వెళ్తున్నప్పుడు traveling దాహం వేస్తే వెంటనే రోడ్డు పక్కన ఉన్న షాపుల్లో బాటిల్ కొని తాగుతాం. అయితే, చాలామంది చేసే తప్పు ఏమిటంటే, సగం నీళ్లు తాగేసి, మిగిలిన బాటిల్‌ను అలాగే కారులోనో లేదా బ్యాగులోనో ఉంచేస్తారు. రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ అదే నీటిని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాక్టీరియా ముప్పు: ఒక్కసారి వాటర్ బాటిల్ మూత తీసిన తర్వాత, నోటి ద్వారా లేదా గాలి ద్వారా బ్యాక్టీరియా ఆ బాటిల్లోకి చేరుతుంది. సీల్ తీసిన నీటిని 24 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచి తాగడం అస్సలు మంచిది కాదు. ఇలా నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల వికారం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కారులో ఉంచితే ఇంకా ప్రమాదం: కారులో ప్రయాణించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండలో పార్క్ చేసిన కారులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ వేడికి బాటిల్లోని నీరు కూడా 60 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. ప్లాస్టిక్ బాటిల్ అంత వేడికి గురైనప్పుడు , అందులో రసాయన మార్పులు జరిగి ‘బీపీఏ’ (బిస్ఫినాల్-A) అనే ప్రమాదకర రసాయనం నీటిలో కలుస్తుంది. బాటిల్ అందంగా మెరవడానికి వాడే ఈ రసాయనం నీటిలో కలిస్తే అది క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది.
plastic bottles | నిపుణుల సూచనలు:
సీల్ తీసిన వాటర్ బాటిల్‌ను అదే రోజున ఖాళీ చేయండి. ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ నీటిని తాగకండి. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా రాగి బాటిళ్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. ప్లాస్టిక్ నీటి వల్ల రక్తపోటు (BP) పెరిగే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ సంస్థ (FSSAI) కూడా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అత్యంత జాగ్రత్తగా వాడాల్సిన జాబితాలో చేర్చింది. కాబట్టి, ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.