అక్షరటుడే, నిజాంసాగర్:Planting Trees | ప్రభుత్వo ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీ(Nurseries)ల్లో మొక్కలు పెంచుతోంది. ఇందుకుగాను రూ.లక్షల్లో వెచ్చిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు(Officers), సిబ్బంది(Staff) నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు.
ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీ(Gram Panchayat)లోని నర్సరీలలో 4వేల మొక్కలను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ మహమ్మద్ నగర్ mohammad nagar mandal మండలంలో తెల్గాపూర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీలో అన్నీ సిద్ధం చేసినా.. మొక్కలు(Plants) మాత్రం కనిపించడం లేదు.
మరో రెండు నుంచి మూడు నెలల్లో మొక్కలు నాటాల్సి ఉండగా, నర్సరీల్లో మొక్కలు పెంచడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొక్కలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
