అక్షరటుడే, ఇందూరు : Giriraj Degree College | మొక్కల పెంపకం భవిష్యత్ తరాలకు బహుమానం లాంటిదని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ (Dharmanayak) తెలిపారు.
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Degree College) మంగళవారం అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా చిత్రాన్ని ప్లాంట్ ఫర్ మదర్, ఏక్ పెడ్ మాకే నామ్ హాష్ ట్యాగ్లను వినియోగించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలన్నారు.
Giriraj Degree College | స్వచ్ఛమైన పర్యావరణం కోసం..
స్వచ్ఛమైన పర్యావరణాన్ని ముందు తరాలకు అందించాలంటే మొక్కలు నాటాల్సిందేనని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి (College Principal Dr. Rammohan Reddy) తెలిపారు. ప్రకృతిని ప్రేమించడం, కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. పూర్వీకులు మనకు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యథావిధిగా ముందుతరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రషీద్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.