Homeక్రైంKarimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

Karimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పలువురు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు. తాత్కాలిక ఆనందం, సుఖాల కోసం జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్​ (Karimnagar)లో చేసుకుంది. వారం క్రితం హత్య జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్​ నగరంలోని కిసాన్​నగర్​కు చెందిన సంపత్​(45)కు భార్య రమాదేవి, కుమారుడు భరత్​ ఉన్నారు. సంపత్​ కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం (Library)లో స్వీపర్​గా పనిచేసేవాడు. రమాదేవి సర్వపిండి అమ్ముతూ విక్రయించేది. అయితే మద్యానిక బానిసైన సంపత్​ నిత్యం రమాదేవిని కొట్టేవాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం ఆమెకు కర్రె రాజయ్య(50) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Karimnagar | అడ్డు తొలగించుకోవాలని..

రాజయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రమాదేవి మద్యానికి బానిసైన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్​ వేసింది. ఈ మేరకు ఎలా హత్య చేయాలని యూట్యూబ్​ (Youtube)లో చూసి, ప్రియుడికి చెప్పింది. ఈ క్రమంలో జులై 29న సంపత్​ భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే రమాదేవి ఈ విషయాన్ని రాజయ్యకు తెలిపింది. అయితే వారిద్దరికి అంతకు ముందే పరిచయం ఉంది. దీంతో మద్యం తాగుదామని చెప్పి రాజయ్య, తన మిత్రుడు కీసరి శ్రీనివాస్​తో కలిసి సంపత్​ను తీసుకెళ్లాడు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పూటుగా మద్యం తాగించిన తర్వాత.. రమాదేవి చెప్పినట్లు సంపత్​ చెవిలో గడ్డిమందు పోశాడు. దీంతో ఆయన చనిపోయాడు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Karimnagar | ఏమి తెలియనట్లు నటన

భర్తను హత్య చేయించిన రమాదేవి ఏమీ తెలియనట్లు నటించింది. తన భర్త కనిపించడం లేదని పోలీసు(Police)లకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 1న సంపత్​ మృతదేహం దొరికింది. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు భరత్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా.. తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో రమాదేవితో పాటు ఆమె ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Must Read
Related News