అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flight Missing | రష్యాలో విమానం మిస్ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane) అదృశ్యం కావడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 50 మందితో బయల్దేరిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం ఒక్కసారిగా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.
రష్యా(Russia)లోని అమూర్ ప్రాంతంలోకి వెళ్లాక ఫ్లైట్ మిస్(Missed Flight) అయినట్లు అధికారులు తెలిపారు. సైబీరియాకు చెందిన అంగారా అనే విమానయాన సంస్థ నడుపుతున్న విమానం చైనా సరిహద్దులో ఉన్న అముర్ ప్రాంతం (Amur Region)లోని టిండా పట్టణం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యా, చైనా సరిహద్దులో విమానం అదృశ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. దాని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. విమానాన్ని వెతకడానికి అవసరమైన అన్ని దళాలను మోహరించామని పేర్కొన్నారు.