అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Plane Landing on Train | కదులుతున్న రైలుపై విమానాన్ని ల్యాండింగ్ చేసి ఓ పైలెట్ చరిత్ర సృష్టించాడు. ఇటలీ పైలట్ (Italy Pilot) డారియో కోస్టా ప్రపంచంలోనే తొలిసారి… 120 కిలోమీటర్ల వేగంలో గల రైలు పై విమానం ల్యాండ్ చేశాడు.
రెడ్‌బుల్ అథ్లెట్ డారియో కోస్టా టర్కీలో కదులుతున్న కార్గో రైలు (Cargo Train)లో తన విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ఖచ్చితత్వంతో ఎగరడంలో మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. 44 ఏళ్ల ఇటాలియన్ పైలట్ ఫిబ్రవరి 15న టర్కీలోని అఫియోంకరాహిసర్ (Afyonkarahisar)లో కదులుతున్న రైలు తొమ్మిదవ కంటైనర్‌ను తాకాడు. అనంతరం మళ్లీ విమానాన్ని టేకాఫ్ చేశాడు. ఈ మొత్తం ప్రక్రియను కోస్టా 50 సెకన్లు పూర్తి చేయడం గమనార్హం.
Plane Landing on Train | అసాధారణ నైపుణ్యం
కదులుతున్న రైలుపై విమానం ల్యాండ్ (Plane Land) చేయడం సాహసం అనే చెప్పాలి. రైలు వేగంతో విమానం వేగాన్ని పోల్చి బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం పట్టు తప్పిన విమానం రైలును ఢీకొనే అవకాశం ఉంది. అయితే సాంకేతిక ఖచ్చితత్వంతో డారియో కోస్టా ఈ సాహసం చేశారు. తన జివ్కో ఎడ్జ్ 540 విమానాన్ని దాదాపు 87 కి.మీ/గం వేగానికి తగ్గించి రైలుపై దించాడు. కోస్టా విమానం సాధారణంగా గంటకు 370 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 148 కి.మీ వేగంతో ల్యాండ్ అవుతుంది. దీంతో 87 కి.మీ/గం తగ్గిన అప్రోచ్ వేగం ముఖ్యంగా సవాలుగా మారుతుంది. అయితే దీనికోసం కోస్టా రెడ్ బుల్ అథ్లెట్ పెర్ఫార్మెన్స్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలుపై ల్యాండింగ్ అనేది తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన, డిమాండ్ ఉన్న ప్రాజెక్టులలో ఒకటి అన్నారు. కష్టం ఉన్నప్పటికీ, ఇది గొప్ప అనుభవం అని పేర్కొన్నారు.