ePaper
More
    Homeఅంతర్జాతీయంBangladesh | బంగ్లాదేశ్​లో కాలేజీ భవనంపై కూలిన విమానం

    Bangladesh | బంగ్లాదేశ్​లో కాలేజీ భవనంపై కూలిన విమానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangladesh | బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ శిక్షణ విమానం (Military Training Aircraft) ఢాకాలోని ఓ కాలేజీ భవనంపై కూలిపోయింది.

    ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకాలో వైమానిక దళ శిక్షణ జెట్ F-7 BJI ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్, కాలేజీ భవనం(College Building)పై సోమవారం కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

    విమానం కూలిపోవడంతో పాఠశాల క్యాంపస్‌కు (School Campus) తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటన తర్వాత చుట్టూ పొగ అలుముకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    More like this

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...