అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Russia Plane Crash | రష్యాలో విషాదం చోటు చేసుకుంది. అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane) కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 50 మృతి చెందారని వెల్లడించారు.
అంగారా ఎయిర్‌లైన్స్ నడుపుతున్న రష్యన్ ప్యాసింజర్ విమానం(Russian Passenger Plane) గురువారం రష్యాలోని ఫార్ ఈస్ట్‌లోని అముర్ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control)తో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 50 మందితో బయల్దేరిన విమానం ఒక్కసారిగా ఏటీసీ సంబంధాలు కోల్పోయింది. చైనా సరిహద్దులో ఉన్న అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు విమానం కోసం గాలించగా.. కూలిపోయిన స్థితిలో గుర్తించారు.
Russia Plane Crash | వాతావరణ కారణాలతో..
మరి కొద్దిసేపట్లో ల్యాండింగ్ అవ్వాల్సిన విమానం కూలిపోవడం(Plane Crash) తీవ్ర విషాదాన్ని నింపింది. వాతావరణం బాగా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వాతావరణం అనుకూలించక.. ల్యాండింగ్ సమయంలో సిబ్బంది చేసిన పొరపాటుతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రష్యన్ వార్త సంస్థలు(Russian News Agencies) పేర్కొన్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 50 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.
Russia Plane Crash | వరుస ఘటనలతో ఆందోళన
ఇటీవల వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిస్తున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న సమయంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శిక్షణ యుద్ధ విమానం పాఠశాల భవనంపై కూలింది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు. తాజాగా రష్యాలో విమానం కూలిపోవడంతో 50 మంది వరకు చనిపోయారు. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు విమానం ఎక్కాలంటనే ఆలోచిస్తున్నారు.
View this post on Instagram