HomeUncategorizedAhmedabad Plane Crash | టేకాఫ్‌కి ముందే అనుమానం వ్య‌క్తం చేసిన మ‌హిళ‌.. భ‌ర్త‌కి కాల్...

Ahmedabad Plane Crash | టేకాఫ్‌కి ముందే అనుమానం వ్య‌క్తం చేసిన మ‌హిళ‌.. భ‌ర్త‌కి కాల్ చేసి మ‌రీ కూడా చెప్పింది..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్(Ahmedabad Airport) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది స్పాట్ లోనే చనిపోయారు . ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు . అయితే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని(Former Gujarat CM Vijay Rupani) మరణించడం పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు .ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ఈ ప్రయాణానికి ముందు రెండు సార్లు లండన్ టికెట్స్ బుక్ చేసుకుని మరి రద్దు చేసుకున్నారు.లండన్ లో ఉన్న భార్య కుమార్తెను కలిసేందుకు మొదటగా మే 19వ తేదీ ఎయిర్ ఇండియా ద్వారానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఆ తర్వాత క్యాన్సిల్ చేసేసారు.

Ahmedabad Plane Crash | ముందే అనుమానం..

జూన్ 5న ప్రయాణించాలి అని నిర్ణయించుకున్నారు. ఆ తేదీకి విమాన టికెట్ బుక్ చేసేసుకున్నారు. అయితే మళ్లీ తన ట్రావెల్ ప్లాన్ ని పర్సనల్ కారణంగా రెండోసారి రద్దు చేసుకున్నారు . ఫైనల్లీ జూన్ 12న ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా విమానం(Air India plane) ఏఐ 171 లోని సీట్ నెంబర్ 2డి ని బుక్ చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన స్పాట్లోనే చనిపోయారు . ఇలా చనిపోయిన ప్ర‌తి ఒక్క‌రికి సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా, అవి క‌న్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే లండన్‌లో జరగాల్సిన బేబీ షవర్ వేడుకకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. వడోదరకు చెందిన యాస్మిన్ వోరా (51), (Yasmin Vora) ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ల కుమార్తె జువేరియా ప్రాణాలు కోల్పోయారు.

యాస్మిన్ వోరా వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌(London)కు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే, థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన టికెట్‌ను 12వ తేదీకి మార్చుకున్నారని యాస్మిన్ భర్త యాసిన్ కన్నీటిపర్యంతమయ్యారు. 12న యాసిన్ స్వయంగా యాస్మిన్‌ను అహ్మదాబాద్ విమానాశ్రయం(Ahmedabad Airport)లో డ్రాప్ చేశారు. విమానం టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు నేను త‌న‌కు ధైర్యం చెప్పాన‌ని యాసిన్ త‌ల‌చుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.