Homeఅంతర్జాతీయంHong Kong Plane Crash | హాంగ్‌కాంగ్‌లో ఘోర‌ విమాన ప్రమాదం.. సముద్రంలోకి జారిపోయిన బోయింగ్...

Hong Kong Plane Crash | హాంగ్‌కాంగ్‌లో ఘోర‌ విమాన ప్రమాదం.. సముద్రంలోకి జారిపోయిన బోయింగ్ 747 కార్గో విమానం

Hong Kong Plane Crash | హాంగ్‌కాంగ్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బయలుదేరిన బోయింగ్ 747 కార్గో విమానం హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hong Kong Plane Crash | ఇటీవలి కాలంలో ఆసియా Asia ప్రాంతంలో విమాన ప్రమాదాలు Plane Crash పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

విమాన ప్రయాణం అత్యంత సురక్షితమని భావిస్తున్నప్పటికీ, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న సమయంలో హాంగ్‌కాంగ్‌ (Hong Kong) లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.

దుబాయ్ నుంచి బయలుదేరిన బోయింగ్ 747 కార్గో విమానం (Boeing 747 cargo plane) (Emirates SkyCargo Flight EK9788) హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport) లో ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది.

ఈ ప్రమాదంలో విమానాశ్రయ గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించగా, విమాన సిబ్బంది నాలుగుగురు సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం (అక్టోబరు 20) తెల్లవారుజామున సుమారు 3:53 గంటలకు ఈ ఘటన జరిగింది.

 Hong Kong Plane Crash | ఊహించ‌ని ప్ర‌మాదం..

టర్కీకి చెందిన ఎయిర్ ఏసీటీ (Air ACT) నిర్వహణలో ఉన్న ఈ ఎమిరేట్స్ కార్గో విమానం దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి హాంగ్‌కాంగ్‌కి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఉత్తర రన్‌వే 07R పై ల్యాండ్ అవుతుండగా విమానం అకస్మాత్తుగా ఎడమ వైపు తిరిగి వేగంగా పరిగెత్తి, పక్కన ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది.

ఆ తర్వాత విమానం ముందు భాగం సముద్రపు గోడను దాటి నీటిలోకి జారిపోయింది. ఈ ప్ర‌మాదం వల్ల గ్రౌండ్ సర్వీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించగా, మరో 41 ఏళ్ల ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు విమాన సిబ్బందిలో నలుగురికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.

ప్రమాదం తరువాత హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టు అధికారులు ఉత్తర రన్‌వేను Runway తాత్కాలికంగా మూసివేశారు. ఫైర్ సర్వీస్‌, మెరైన్ పోలీసులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.

విమానం ట్రాకింగ్ డేటా ప్రకారం ల్యాండింగ్ సమయంలో దిశ అకస్మాత్తుగా మారడం గమనార్హం. ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ, అధికారులు బ్లాక్‌బాక్స్‌ను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన కారణంగా అదే రన్‌వేపై ల్యాండ్ అవ్వాల్సిన క్యాథే పసిఫిక్ ఫ్లైట్ CX851ని అత్యవసరంగా దక్షిణ రన్‌వేకు మళ్లించారు. ప్రమాదంతో హాంగ్‌కాంగ్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా అంతరాయం కలిగించాయి.