HomeUncategorizedDelta Airlines | గాలిలో ఉండగా విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం : వీడియో

Delta Airlines | గాలిలో ఉండగా విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం : వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delta Airlines | మరో విమానంలో మంటలు చెలరేగాయి. గాలిలో ఉండగా విమానం ఇంజిన్​లో మంటలు అంటుకోవడంతో పైలట్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​ (Emergency Landing) చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

డెల్టా ఎయిర్ లైన్స్ (Delta Airlines) కు సంబంధించిన లాస్​ఎంజెలిస్ నుంచి అట్లాంటాకు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమాన సిబ్బంది వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను ఆర్పారు.

Delta Airlines | భయపెట్టిస్తున్న బోయింగ్​

బోయింగ్​ విమానాలు (Boeing Planes) ప్రయాణికులను భయ పెట్టిస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్​ విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో డెల్టా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 767-400 ఫ్లైట్​ ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. టేకాఫ్​ అయిన కొన్ని క్షణాలకే మంటలు చెలరేగడం.. పైలెట్​ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమానం దాదాపు 25 ఏళ్ల క్రితం నాటింది.

Must Read
Related News