అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రణాళికలు వేశారు. రద్దీగా ఉండే ఖలీల్వాడిలో (Khaleelwadi) ట్రాఫిక్ నియంత్రణకు మూడుచోట్ల పార్కింగ్ పాయింట్లు (Parking Points) ఏర్పాటు చేశారు.
Nizamabad Traffic Police | ఆస్పత్రులకు వచ్చే వారికి..
ముఖ్యంగా జిల్లా నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారు ఖలీల్వాడిలో ట్రాఫిక్ కారణంగా అనేక ఇబ్బందులు పడేవారు. రోగుల..రోగుల బంధువులు ఆస్పత్రులకు వెళ్లాలంటే గగనంగా మారేది. ఇరుకు రోడ్లకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ఖలీల్వాడిలో నడవాలన్నా నరకంగా మారింది.
Nizamabad Traffic Police | మూడు ప్రాంతాల్లో..
ఖలీల్వాడిలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు. టూవీలర్స్, త్రీవీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం వెహికల్ పార్కింగ్ స్థలాలను ఖరారు చేశారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం, పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు.
Nizamabad Traffic Police | ఐఎంఏతో గతంలో సమావేశం..
సీపీ సాయిచైతన్య నాలుగైదు రోజుల క్రితం నగరంలో ఐఎంఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఖలీల్వాడిలో ట్రాఫిక్ నియంత్రణకు వారి నుంచి పలు సూచనలు సలహాలు స్వీకరించారు. అనంతరం పలు చర్యలు తీసుకున్నారు. ఖలీల్వాడిలో మొత్తంగా వన్‌వే ఏర్పాటు చేశారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో వాహనాలు పార్కింగ్ చేయాలని నిర్ణయించారు.
Nizamabad Traffic Police | ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో..
ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ(Traffic ACP Mastan Ali), ఇన్స్పెక్టర్ ప్రసాద్‌లకు (Inspector Prasad) సీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సిబ్బంది రాజీవ్ గాంధీ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసి ఖలీల్ వాడికి వచ్చే వాహనదారులకు అవగాహన కల్పించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి చార్జీ వసూలు చేయడం లేదు.
అదేవిధంగా పార్కింగ్ కోసం రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులలో పాత డీఈఓ ఆఫీస్‌తో పాటు వెజ్ నాన్ వెజ్ మార్కెట్లలో కూడా పార్కింగ్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నగర ప్రజలు స్వాగతిస్తున్నారు.
నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ట్రాఫిక్ ఏర్పాట్లు