అక్షరటుడే, ఇందూరు : Nizamabad Collector | భూ భారతి, రెవెన్యూ సదస్సులలో (Revenue conferences) వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహశీల్దార్లు పాల్గొన్నారు.