HomeUncategorizedPrashant Kishor | బీజేపీ, కాంగ్రెస్‌పై పీకే విసుర్లు.. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఆరాట‌మ‌ని విమ‌ర్శ‌

Prashant Kishor | బీజేపీ, కాంగ్రెస్‌పై పీకే విసుర్లు.. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఆరాట‌మ‌ని విమ‌ర్శ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashant Kishor | బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త‌, జ‌న‌సూర‌జ్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిశోర్(Prashant Kishor) విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రెండు జాతీయ పార్టీల‌కు సామాజిక సంస్క‌ర‌ణ‌ల కంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని విమ‌ర్శించారు. కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) నిర్ణ‌యించ‌డం, ఇద త‌మ ఘ‌న‌తేన‌ని రెండు పార్టీలు చెప్పుకోవ‌డాన్ని పీకే ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు రాజ‌కీయ ల‌బ్ధి మాత్ర‌మే కావాల‌ని, సామాజిక సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం లేద‌ని మండిప‌డ్డారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని బీహార్‌లో రెండేళ్ల క్రితమే కుల గ‌ణ‌న లెక్క‌లు జ‌రిగాయ‌ని పీకే గుర్తు చేశారు. ఆ కుల స‌ర్వే ఫ‌లితాల‌తో బీహార్ ప్ర‌భుత్వం(Bihar Government) ఏం చేసిందో బీజేపీ జ‌వాబు చెప్పాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌శ్నించారు.

Prashant Kishor | రాహుల్‌గాంధీని ఎవ‌రు ఆపారా?

ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ (Congress Party)కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే పాకులాడుతుంది త‌ప్ప ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. తమ వ‌ల్లే కేంద్రం ప్ర‌భుత్వం కుల గ‌ణ‌నకు అంగీక‌రించింద‌న్న క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ య‌త్నిస్తున్నాద‌న్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ(Grand Old Party) అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల స‌ర్వేల ఆధారంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో కాంగ్రెస్ నాయ‌కులు(Congress Leaders) ఎందుకు విఫ‌ల‌మ‌య్యారని ప్ర‌శ్నించారు. “కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌ల‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ప‌థ‌కాలు అమలు చేయ‌కుండా రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని ఎవ‌రు ఆపారు? సామాజిక అంత‌రాల‌ను కుల గ‌ణ‌న‌తో మెరుగుప‌ర‌వ‌చ్చనే రాహుల్‌గాంధీ చెబుతున్నాడు. మ‌రి మీరు అణ‌గారిన వ‌ర్గాల‌కు స‌హాయం చేయ‌డానికి ఎందుకు ముందుకు రావ‌డం లేద‌ని” ప్ర‌శ్నించారు. కుల గణనను నిర్వహించడం ద్వారా మాత్ర‌మే వెనుకబడిన తరగతుల పరిస్థితిని మెరుగుపరచదని కిషోర్ తెలిపారు. వారి సామాజిక‌, ఆర్థిక‌స్థితిగ‌తుల‌కు ప్ర‌భుత్వాలు ముందుకొస్తేనే బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

Must Read
Related News