అక్షరటుడే, బాన్సువాడ: National Vaddera Association | జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బాన్సువాడ (Banswada) మండలం కొయ్య గుట్టకు (Koyyagutta) చెందిన పిట్ల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, జాతీయ గౌరవాధ్యక్షుడు రూపం లోకనాథం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నిక నిర్వహించారు.
National Vaddera Association | వడ్డెరలను ఎస్టీల్లో చేర్చేవరకు పోరాటం..
ఈ సందర్భంగా నూతన జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ.. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెరలు స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) పోటీ చేసి గెలుపొందాలంటే మనలో ఐకమత్యం ఉండాలని సూచించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వడ్డెర్ల ఉద్యమ చైతన్య యాత్ర నిర్వహిస్తానని ఆయన వివరించారు.