అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pineapple | పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. అనేక రకాల పోషకాలతో (nutrients) సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి పైనాపిల్ దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్ సీ, విటమిన్ బీ6, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు (nutrients) పుష్కలంగా ఉంటాయి. ఆయా పోషకాల కారణంగానే పైనాపిల్‌ను (pineapple) ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. పనసపండు తినడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీంతో అనారోగ్యం దరి చేరదు. అలాగే, చర్మం కాంతివంతమవుతంది.
Pineapple | పైనాపిల్ వల్ల కలిగే లాభాలు ఇవి..
పైనాపిల్ గుండె ఆరోగ్యాన్ని (heart health) బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే పోషకాలు అధికంగా ఉండే పైనాపిల్ తరచూ తీసుకోవడం మంచిది. అలాగే, ఎముకలను బలోపేతం చేసుకోవడానికి దీన్ని తినాలి.
Pineapple | వెయిట్ లాస్..
పైనాపిల్‌లో లభించే పోషకాలు మీ జీర్ణ వ్యవస్థను (digestive system) క్రమబద్ధీకరిస్తాయి. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడే వారు పైనాపిల్‌ను తింటే వాటి నుంచి బయట పడొచ్చు. అలాగే, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు (nutrients) నేరుగా శరీర భాగాలకు చేరుతాయి. అలాగే, ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి పైనాపిల్ సహాయపడుతుంది.
Pineapple | ఇమ్యూనిటీ పెరుగుదల..
పైనాపిల్‌లో విటమిన్ సీ (vitamin C) పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచుగా అనారోగ్యానికి గురవుతారు. పోషకాలు అధికంగా ఉండే పైనాపిల్ (pineappel) తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. పైనాపిల్ మీ ఆరోగ్యానికి, మీ చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.