అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ మండలంలో ఓ పావురం(Pigeon) కలకలం రేపింది. భవానిపేట గ్రామంలో బాలుడికి పావురం దొరికింది. అయితే దాని కాలికి కోడ్ రింగ్ ఉండడంతో గూఢాచారి పావురం (Spy Pigeon) అంటూ ప్రచారం జరిగింది.
దీంతో స్థానికులు ఆందోళన చెందారు. రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని ఠాణాకు తరలించి దర్యాప్తు చేశారు. దీనిపై బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ను (Bodhan Rural SI Machender) వివరణ కోరగా.. అది గూఢాచారి పావురం కాదని చెప్పారు. రేసింగ్ పావురంగా గుర్తించినట్లు తెలిపారు.