10
అక్షరటుడే, వెబ్‌డెస్క్: PhonePe | యూపీఐ UPI పేమెంట్ యాప్ ఫొన్‌పే (PhonePe)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా సరికొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ వచ్చింది. దీనివల్ల వినియోగదారులు ప్రతి లావాదేవీకి పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేకుండా ఫింగర్ Finger ప్రింట్ Print కానీ, ఫేస్ Face ఐడీ ID తో నేరుగా చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ₹5,000 లోపు చేసే లావాదేవీలకు ఈ ‘వన్-టచ్’ పేమెంట్ వెసులుబాటు వర్తిస్తుందని ఫొన్‌పే సంస్థ వెల్లడించింది. అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలకు పిన్ నంబర్ తప్పనిసరి అని పేర్కొంది.
PhonePe | పరిమితులు
- వినియోగదారులు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంకు Bank బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
- వరుసగా 12 నెలలు వాడని UPI IDలను వాటికవే డియాక్టివేట్ అయ్యేలా సిస్టమ్‌ను మార్చారు.
- EMIs, సబ్స్క్రిప్షన్లు, బిల్లుల ఆటోపే (Autopay) లు ఇకపై కేవలం నాలుగుసార్లు మాత్రమే ప్రయత్నించవచ్చు. (ఒకటి అసలు + మూడు రీట్రైలు).