అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ విచారణకు (SIT Investigation) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌కు (Phone Tapping) గురైన బాధితుల స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలోనే విచారణకు హాజరు కావాలని బండి సంజయ్‌కి (Bandi Sanjay) సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
Phone Tapping Case | కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ
సిట్ విచారణ నిమిత్తం కేంద్ర మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌజ్‌కు (Dilkusha Guest House) చేరుకున్నారు. అంతకుముందు ఆయన ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో (Khairatabad Hanuman Temple) ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ కార్యకర్తలో ర్యాలీగా ఆయన దిల్కుషా గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అత్యధికంగా తన ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తానే బయట పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ మధ్య దోస్తీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్‌కు ఇస్తానని చెప్పారు.
Phone Tapping Case | సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీఆర్ఎస్ను కాపాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ టైమ్‌పాస్ వ్యవహారంలా ఉందన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు.
Phone Tapping Case | మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్‌గా..
బీఆర్ఎస్ హయాంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్‌పై నిఘా వర్గాలు పలు ఆధారాలు అందించాయి. వాటిని ఆయన సిట్‌కు సమర్పించనున్నారు. అయితే బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు (Sit Officers) తెలిపారు. ఆందోళనలు, కేసుల విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు.