ePaper
More
    HomeతెలంగాణUnion Minister kishan reddy | ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐకి అప్పగించాలి : కేంద్ర...

    Union Minister kishan reddy | ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐకి అప్పగించాలి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ను ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు జడ్జీలు, సినీనటులు, పాత్రికేయుల ఫోన్లను సైతం ట్యాపింగ్​ చేసిందని ఆరోపించారు. ఈ కేసును రాష్ట్ర సర్కారు కేసును సీబీఐ అప్పగించకపోతే తామే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

    Union Minister kishan reddy | పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్​ షా

    పసుపు రైతుల దశాబ్దాల కలను బీజేపీ ప్రభుత్వం సాధ్యం చేసిందని కిషన్​ రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ జిల్లాకు పసుపు బోర్డును మంజూ చేసిందని గుర్తు చేశారు. బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఇందూరులో ఈనెల 29న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు రైతులు ఏళ్ల పోరాట ఫలితంగా బీజేపీ రాష్ట్ర, జాతీయ పార్టీ చొరవతో పసుపు బోర్డును ప్రధాని మోదీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు.

    Union Minister kishan reddy | పలు రాష్ట్రాలు పట్టుబట్టినా..

    పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం కోసం పలు రాష్ట్రాలు పట్టుబట్టాయని కేంద్ర మంత్రి తెలిపారు. అయినా మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవంతో పాటు నగరంలో నిర్వహించనున్న రైతు మహాసభకు పార్టీలకు అతీతంగా జిల్లాలోని రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. పసుపు పండించే రైతులే కాకుండా జిల్లాలోని అన్ని రైతు సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైన తర్వాత రైతులకు భవిష్యత్తులో మేలు చేసే కార్యక్రమాలను రూపొందించాలని ఆయన సూచించారు.

    Union Minister kishan reddy | 29న మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ

    మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈనెల 29న నగరంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధిలో డి శ్రీనివాస్ పాత్ర మరవలేనిదన్నారు. ఆయన చివరి రోజుల్లో భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారని గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్​ మున్సిపల్​ మాజీ ఫ్లోర్​ లీడర్​ స్రవంతి రెడ్డి, జగిత్యాల మాజీ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ భోగ శ్రావణి, నేతలు మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Union Minister kishan reddy | పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ

    జక్రాన్​పల్లి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ అనంత్​రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆయన పార్టీ కండవా కప్పి ఆహ్వానించారు. అనంత్​రెడ్డితో పాటు జక్రాన్​పల్లి మండలానికి చెందిన 50మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.

    పార్టీలో చేరిన అనంత్​రెడ్డిని అభినందిస్తున్న కిషన్​రెడ్డి, ఎంపీ అర్వింద్​

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...