అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ విచారణ వేగవంతం చేసిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు (MLC Naveen Rao)ను అధికారులు ఆదివారం 8 గంటల పాటు విచారించారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. హరీశ్‌రావు విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఉదయం కొట్టేసింది.
Supreme Court | జోక్యం చేసుకోలేం
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ గతంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station)లో ఫిర్యాదు చేశారు. హరీశ్‌రావు సూచనల మేరకు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. కాగా చక్రధర్‌గౌడ్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలకు ముందు ఆయనపై పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రధర్‌గౌడ్ హస్తం గూటికి చేరారు. అనంతరం హరీశ్‌రావుపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై హరీశ్‌రావు (Harish Rao) హైకోర్టును ఆశ్రయించగా.. కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.