Homeక్రైంPhone Tapping Case | విచారణకు హాజరైన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు

Phone Tapping Case | విచారణకు హాజరైన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఏ–6 శ్రవణ్​రావు మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఓ కంపెనీని రూ.6 కోట్ల మేర మోసం చేసినట్లు తెలిసింది. సరుకు సరఫరా చేయకపోయినా డబ్బులు తీసుకున్నట్లు శ్రవణ్ రావుపై సదరు కంపెనీ ఫిర్యాదు చేసింది. రూ.6 కోట్ల వరకు మోసం చేశారని కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్​రావు కీలకంగా వ్యవహరించినట్లు సిట్​ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ–6 ఉన్న ఆయనను ఇది వరకే సిట్​ విచారించింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోయిన శ్రవణ్​రావు అక్కడే ఉండిపోయారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్​ రావడంతో మార్చిలో హైదరాబాద్​ వచ్చారు. ఈ క్రమంలో మార్చి 29న సిట్​ అధికారులు ఆయనను విచారించారు. తాజాగా రూ.6 కోట్ల మోసం కేసులో ఆయనను విచారించారు.