అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping allegations | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పొంగులేటి మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone tapping ) జరిగింది వాస్తవం అన్నారు. పెద్దల నుంచి సామాన్యుల వరకు ఎవ్వరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు ఇప్పుడు ట్యాపింగ్ పరికరాలను వాడుతున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాము అధికారులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విషయాలు కూడ బయటికి వస్తుయన్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఎంక్వయిరీ చేస్తోందన్నారు. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Phone tapping allegations | 80 శాతం స్థానాల్లో గెలుస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరగనున్న 116మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 80శాతం పైగా స్థానాల్లో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Phone tapping allegations | సీఎం రేసులో లేను
తాను సీఎం రేసులో లేనని పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తనని, ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని ప్రజల నుంచి అనేక వినతులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం దానిపై ఒక కమిటి వేసి, నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడుతామన్నారు. అనంతరం పునర్ వ్యవస్థీకరణ చేపడుతామన్నారు. గత ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు.