అక్షరటుడే, వెబ్డెస్క్ : Pharma Company Reactor Blast | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లగిరి వద్ద ఉన్న బృందావన్ లాబొరేటరీస్ (ఫార్మా కంపెనీ) శుక్రవారం రాత్రి రెండు రియాక్టర్లు పేలాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో భారీగా ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. గతంలో సైతం పలు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి రెండు రియాక్టర్లు పేలడంతో (Reactor Blast) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్ధం దాటిని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
Pharma Company Reactor Blast | మూడు గంటలు శ్రమించి..
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కంపెనీలో 11 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు గాయపడ్డట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Pharma Company Reactor Blast | స్థానికుల ఆగ్రహం
ఫార్మా కంపెనీ (Pharma Company)లో అగ్ని ప్రమాదంపై స్థానికులతో పాటు కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కంపెనీలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.