Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | అనారోగ్యంతో పీజీ విద్యార్థిని మృతి

Indalwai | అనారోగ్యంతో పీజీ విద్యార్థిని మృతి

- Advertisement -

అక్షరటుడే,ఇందల్వాయి: Indalwai | అనారోగ్యంతో ఓ పీజీ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లవెల్లి (nalalvelli) గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) రవి కుమార్తె సంజన (21) హైదరాబాద్​లో పీజీ (PG student) అభ్యసిస్తోంది. వారం రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికాగా.. తల్లిదండ్రులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో (Private Hospital) చికిత్స​ చేయిస్తున్నారు.

అయితే మూడురోజులుగా కోమాలో ఉన్న సంజన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయి అకాలమరణం చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.